జక్కన్న డైలాగులు పేలతాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మన్నార్‌చోప్రా జంటగా ఆర్.పి.ఎ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సునీల్ నటించిన ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జక్కన్న రూపొందిందని, హీరో కామెడీ టైమింగ్‌కి దర్శకుడు రాసిన సీన్లకి థియేటర్లలో క్లాప్స్ పడతాయని తెలిపారు. సునీల్ బ్యాక్ టు ఎంటర్‌టైన్‌మెంట్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ రూపొందడం ఆనందంగా వుందని, ఈ చిత్రంలోని అన్ని పాటలు పాడుకోవడానికి వీలుగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇటీవల చిరంజీవి విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, అదేవిధంగా ట్రైలర్‌కు కూడా ఆదరణ బాగా వుందని ఆయన తెలిపారు. పంచ్ డైలాగులతో సినిమా మొదటినుంచీ ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తమ సంస్థ సగర్వంగా ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతోందని ఆయన అన్నారు. కబీర్‌సింగ్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్రభాస్ శ్రీను, చిత్రం శ్రీను, రఘు, సత్యప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్‌రాజ్, సత్య, హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సి.రాంప్రసాద్, సంగీతం:దినేష్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, మాటలు:్భవాని ప్రసాద్, నిర్మాత:ఆర్.సుదర్శన్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వంశీకృష్ణ ఆకెళ్ళ.