తిక్క పాటలొస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి ధరమ్‌తేజ్, లరిస్సాబోన్సీ, మన్నార్‌చోప్రా ప్రధాన తారాగణంగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘తిక్క’. శ్రీ వేంకటేశ్వరా మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి పాటను లడఖ్‌లో చిత్రీకరించి సినిమాను పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ, లడఖ్‌లో చిత్రీకరించిన పాటతో సినిమా మొత్తం షూటింగ్ పూర్తిచేశామని, తమన్ అందించిన ఆడియోను ఈనెల 30న విడుదల చేయనున్నామని తెలిపారు. సాయి ధరమ్‌తేజ్ ఈ చిత్రానికి బ్యాక్‌సపోర్టుగా నిలిచారని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 13న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ముమైత్‌ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, అలీ, సప్తగిరి, తా.రమేష్, వెనె్నల కిశోర్, అజయ్, రఘుబాబు, ప్రభాస్‌శ్రీను, సత్య, ఆనంద్, కామ్నాసింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:కె.వి.గుహన్, సంగీతం:ఎస్.ఎస్.తమన్, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, కథ:షేక్ దావూద్, మాటలు:హర్షవర్థన్, నిర్మాత:సి.రోహిణ్‌రెడ్డి, దర్శకత్వం:సునీల్‌రెడ్డి.