కబాలీ పైరసీకి కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా ఈనెల 22న విడుదల కానున్న రజనీకాంత్ తాజా చిత్రం కబాలీపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాను పైరసీని రక్షించాలని, ఇంటర్నెట్‌లో ఆ చిత్రం ప్రసారం లేదా డౌన్‌లోడ్ జరగకుండా చూడాలని కబాలీ చిత్ర నిర్మాత కలైపులి ఎన్ థాను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిర్మాతకు అనుకూలంగా స్పందించింది. 225 వెబ్‌సైట్లు, 169 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన వ్యవస్థలో కబాలీ పైరసీకి గురికాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ట్రాయ్‌కు దిశానిర్దేశం చేసింది. భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచదేశాల్లో విడుదల కానుండగా ఇప్పటికే ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. మార్కెటింగ్, ప్రచారం సహా ఎన్నో అంశాల్లో కబాలీ చరిత్ర సృష్టిస్తోంది. దీంతో ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు రజనీ అభిమానులు.