గ్యారేజ్‌కు తుదిమెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ కథానాయకుడిగా మైత్రి మూవీ సంస్థ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, మలయాళ నటుడు మోహన్‌లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మొదట ఆగస్టు 12న విడుదల చేయాలని అనుకున్నా, సినిమాను నాణ్యంగా రూపొందించడం కోసం మరొక మూడు వారాల గడువు తీసుకున్నామని వారు తెలిపారు. ఆగస్టులోనే ఆడియో విడుదల కార్యక్రమం జరుపుతామని, పోస్ట్‌ప్రొడక్షన్ కోసం కొంత సమయాన్ని అదనంగా తీసుకుంటున్నామని, చిత్రం అందరికీ నచ్చే విధంగా రూపొందిందని దర్శకుడు కొరటాల శివ అన్నారు. మంచి స్పాన్ వున్న చక్కటి కథతో స్క్రీన్‌ప్లే బేస్డ్ కథనంతో రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన హైలెట్‌గా వుంటుందని ఆయన తెలిపారు. మరొక పది రోజులపాటు షూటింగ్ జరపవలసి వుందని, వర్షాల కారణంగా షూటింగ్‌కి అంతరాయం కలగడంతో కొంత సమయం పెరుగుతోందని తెలిపారు. టీజర్‌తోపాటుగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కు వ్యూస్ పెరిగాయని, దాంతో అంచనాలూ పెరిగాయని ఆయన అన్నారు. సెప్టెంబర్ 2న విడుదలకానున్న ఈ చిత్రంలో సాయికుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ, జాన్, గుణాజీ, సితార, దేవయాని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:తిరు, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు:నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్, రచన, దర్శకత్వం:కొరటాల శివ.