ఇద్దరూ ఇద్దరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక మాధ్యమంలో ఎక్కువమందిని ఆకర్షించిన సెలబ్రిటీలు ఎవరో తెలుసా! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్, తమ అందచందాలతో కిర్రెక్కించే తార సన్నీలియోన్. ఈమాట వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌చేస్తున్న ఫొటోలు సల్మాన్‌ఖాన్, సన్నీలియోన్‌లవే అత్యధికంగా ఉండడం విశేషం. అందుకే గూగుల్ సెర్చ్ వీరిద్దరిని అత్యధికులు ఇష్టపడుతున్న సెలబ్రిటీలుగా గుర్తించింది. పది సంవత్సరాల ఈ రేసులో ఎక్కువమంది షారుఖ్‌ఖాన్‌కన్నా ఎక్కువగా సల్మాన్‌ఖాన్‌నే గూగుల్ సెర్చ్‌లో వెతుకుతున్నారట. అక్షయ్‌కుమార్, అమితాబ్ లాంటి వాళ్లు కూడా స్థానాలు పొందారు. అదే విధంగా అందాల భామల వేటలో కత్రినాకైఫ్, ప్రియాంక చోప్రా, కరీనాకపూర్, దీపికాపదుకొనె లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈ విషయానే్న గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ సప్నఛద్దా వివరిస్తూ దాదాపు పది మిలియన్ల మొబైల్స్‌లో గూగుల్ సెర్చ్‌లో సల్మాన్‌ఖాన్ తొలి స్థానం ఆక్రమించగా, ఫిమేల్ కేటగిరీలో సన్నీలియోన్ మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఇండియన్స్ తమకిష్టమైన నటులను చూడాలనుకుంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని, అందులో ఎక్కువగా వీరిద్దరి ఫొటోలే ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.