ఇలియానా గుర్రం.. అక్షయ్ కళ్ళెం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలభామ ఇలియాన స్వారీ చేస్తున్న గుర్రం అదుపుతప్పితే అక్షయ్‌కుమార్ కళ్లెం వేసి కట్టడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్షయ్‌కుమార్, ఇలియానా కలిసి నటిస్తోన్న హిందీ ‘రుస్తుం’ చిత్రం షూటింగ్ ఈమధ్య లండన్‌లో చేశారు. ఆ చిత్రంలో ఓ సన్నివేశంలో ఇలియానా గుర్రంపై స్వారీ చేస్తూండాలి. షూటింగ్ మొదలైన వెంటనే గుర్రం బెదిరిపోయింది. ఇలియానా గందరగోళానికి గురై పడిపోయే సమయంలో అక్కడే ఉన్న హీరో అక్షయ్ స్పందించి కళ్లాన్ని అందుకుని గుర్రాన్ని అదుపుచేశాడు. నిజానికి ఇది సినిమాకోసం చేసిన గందరగోళం కాదు. నిజంగా జరిగినదే. కానీ అనుకోకుండా ఎదురైన ఈ సన్నివేశం బాగుండటంతో సినిమాలో ఈ దృశ్యాన్ని అలాగే ఉంచేయాలని నిర్ణయించారట దర్శక నిర్మాతలు.