గోపీచంద్‌కు సరిజోడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పాపులరైన అందాల భామ హన్సికకు తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ చేసిన రెండు మూడు సినిమాలు ఆశించిన పలితాలని రాబట్టకపోవడంతో కోలీవుడ్డే బెటరని అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఈమెకు తెలుగులో మరో అవకాశం దక్కింది. ప్రముఖ నటుడు గోపీచంద్ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా హన్సిక ఓకె అయింది. తనదైన గ్లామర్‌తో ఆకట్టుకునే హన్సిక ఈ సినిమాతో మళ్లీ తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారాలని ప్రయత్నాలు చేస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. ‘బెంగాల్ టైగర్’తో మంచి విజయానే్న అందుకున్న సంపత్‌నంది తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ ఆశలే పెట్టుకుంది గ్లామర్ భామ హన్సిక.