అప్పుడు సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు గ్రహాంతరవాసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ వ్యవస్ధాపకుడు జెఫ్ బొజెస్ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. సినీరంగంపై మొదటినుంచి ఆసక్తి ఉన్న జెఫ్ మొదట్లో ఓ షార్ట్ఫిల్మ్ ‘టూత్ ఫెయిరీ’లో నటించాడు. ఇందులో ఆయన ఓ సెక్యూరిటీ గార్డు పాత్రలో నటించాడు. ఇప్పుడు తొలిసారిగా హాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న స్టార్‌ట్రెక్ మూడోభాగం సినిమా ‘స్టార్‌ట్రెక్ బియాండ్’లో ఓ సైనికాధికారిగా కొద్దిక్షణాలు కన్పిస్తాడు. ఈ దృశ్యం చిత్రీకరణ గత శుక్రవారం సింగిల్‌ట్రాక్‌లో సాగింది. ఇందుకోసం షూటింగ్ స్పాట్‌కు వచ్చిన జెఫ్ ఓపిగ్గా, వినయంగా వేచిచూసి నటించి వెళ్లారని ఆ చిత్ర దర్శకుడు జస్టిన్ లిన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అబ్రమ్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కు జెఫ్ రాకను ఆ యూనిట్ స్వాగతించింది. ఓ రాజు వచ్చినట్లు ఆయన వచ్చి నటించారని యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటినుంచి అంతరిక్షం, ఖగోళం, గ్రహాలు వంటి అంశాలపై ఆసక్తి ఉన్న జెఫ్ పెద్దవాడయ్యాక సొంతంగో ‘బ్లూ ఆరిజన్’ అనే పేరుతో ఓ స్పేస్ కంపెనీ నెలకొల్పాడు.