చిన్నారుల కోసం సూపర్ రైమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్సెల్ ఫిలింస్ సమర్పణలో రాంరెడ్డి పన్నాల దర్శకత్వంలో వాజిద్‌ఖాన్ నిర్మిస్తున్న సూపర్ రైమ్స్ పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్.పి సత్యనారాయణ సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. చిన్నపిల్లల మనోవికాసానికి, మనస్తత్వానికి అర్థమయ్యేలా రూపొందించిన ఈ సూపర్ రైమ్స్ తప్పకుండా సక్సెస్ కావాలని అన్నారు. దర్శకుడు రాంరెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది చిన్నపిల్లలకోసం ప్రత్యేకంగా సరికొత్త థీమ్‌తో డిజైన్ చేశామని, త్వరలోనే సినిమాను డివిడి రూపంలో విడుదల చేస్తామని అన్నారు. నిర్మాత వాజిద్‌ఖాన్ మాట్లాడుతూ, ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని, తప్పకుండా పిల్లలతోపాటు పెద్దలకు కూడా నచ్చుతుందని అన్నారు.