నెగిటివ్ రోల్స్ చేయడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, అక్ష జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రాజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రహ్మణ్య ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మెంటల్’. ‘మెంటల్ పోలీస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పోలీసుల అభ్యంతరాల మేరకు ‘మెంటల్’ టైటిల్‌గా మార్చారు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘సిన్సియర్ పోలీసు అధికారిగా ఈ చిత్రంలో కన్పిస్తాను. రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా, చివరకు కట్టుకున్న భార్య అయినా క్షమించని పాత్ర నాది. మెంటల్ పోలీస్ అనే టైటిల్ కారణంగా కేసు కోర్టువరకూ వెళ్లింది. అందుకే దీన్ని ‘మెంటల్’గా మార్చాం. పోలీసులు గర్వంగా ఫీలయ్యే సినిమా ఇది. అలాగే, నేను నెగటివ్ రోల్స్‌లో కనిపిస్తానని ప్రచారం చేస్తున్నారు. నేను అలాంటి పాత్రలు చేయడంలేదు. ముఖ్యంగా నన్ను ఎవరూ ఆ తరహా పాత్రలు చేయమని సంప్రదించడంలేదు. ఒకవేళ అలాంటి అవకాశాలు వస్తే నాకు నచ్చితే చేస్తా’ అన్నారు. దర్శకుడు కరణం బాబ్జీ మాట్లాడుతూ, ‘ఈ టైటిల్‌పై వివాదాల కారణంగా సినిమా ఆలస్యమైంది. ఇందులో శ్రీకాంత్ నటన అద్భుతంగా వుంటుంది. చచ్చినా బ్రతికినా పోలీసుగానే బ్రతకాలి అనుకునే పాత్ర ఇది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తప్పకుండా ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్‌లో ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ల తరువాత మంచి చిత్రంగా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సాయి కార్తీక్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా:బుజ్జి, నిర్మాతలు:వి.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్ దాసరి, వి.వి.దుర్గాప్రసాద్ అనగాని, దర్శకత్వం:కరణం బాబ్జి.