భయపెడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య దక్షిణాదిలో హారర్ సినిమాల హవా బాగా ఎక్కువైంది. ఇప్పటికే వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. మరిన్ని రూపొందుతున్నాయి కూడా. ముఖ్యంగా ఈ తరహా సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోయిన్లు ముందుకు రావడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఇపుడు వీరి దారిలోకి వస్తోంది మరో క్రేజీ హీరోయిన్ కాజల్. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్‌కు ఈమధ్య ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు భారీ సినిమాలు ఫ్లాప్ అవడంతో కాస్త నిరాశలో పడింది. దాంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ చేసిన ‘దో లఫ్జోంకి కహాని’ సినిమా కూడా దెబ్బకొట్టింది. తాజాగా అజిత్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్, మరో హారర్ చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పిందట. హారర్ జోనర్‌లో తెరకెక్కే ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఆశిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. మరి ఈ సినిమాతో కాజల్ ఎలా భయపెడుతుందో చూడాలి!