మనందరి జీవిత కథే.. మనమంతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఐతే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రంతోనే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. ఆ తరువాత భిన్నమైన కథలతోనే చిత్రాలను చేస్తూ వచ్చాడు. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘మనమంతా’. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు చంద్రశేఖర్ చెప్పిన విశేషాలు...
నలుగురి మధ్య కథ..
కథ గురించి చెప్పాలంటే నలుగురు భిన్న వయసు వున్నవారిమధ్య జరిగే కథ. ఒక మిడిల్ క్లాసు ఉద్యోగి, ఒక గృహిణి, ఒక కాలేజీ విద్యార్థి, ఒక స్కూలు విద్యార్థిని జీవితాల చుట్టూ జరిగిన కథ ఇది. ప్రతిరోజూ మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మన జీవితంలో జరిగే విశేషాలు ఇందులో వుంటాయి. తప్పకుండా ఈ నలుగురి జీవితాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా వుంటాయి. ఇప్పటివరకు నేను భిన్నమైన ప్రయోగాలు చేశాను. కానీ ఇది కుటుంబ అంశాలతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
మర్చిపోలేని అనుభవం
సూపర్‌స్టార్‌లాంటి నటుడు మోహన్‌లాల్‌తో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ కథ అనుకున్నపుడు ఆయనైతే బాగుంటుందని ఆయన్ని సంప్రదించాను. నిజానికి ఈ కథ చెప్పాలంటే ఇక్కడ మనవాళ్లకి ఎలాంటి స్టార్ ఇమేజ్ లేని హీరో అయితే బాగుంటుందని ఆయన్ని ఎంచుకున్నాను. కథ విన్న వెంటనే సినిమా చేద్దామన్నారు. నిజంగా ఆయనతో పనిచేస్తుంటే కొత్త ఎక్స్‌పీరియన్స్ దక్కింది. ఆయన ఒక సూపర్‌స్టార్‌లా కాకుండా నిత్య విద్యార్థిలా వుంటాడు. అలాగే మరో పాత్రకు గౌతమిని ఎంచుకోవడం జరిగింది.
గ్యాప్ రావడానికి కారణం
‘సాహసం’ సినిమా తరువాత ఏడాదిన్నరకు ఈ సినిమా మొదలుపెట్టాను. గ్యాప్ రావడానికి చాలా కారణాలుంటాయి. నేను కథ రాసుకోవడానికి ఆరునెలల సమయం పడుతుంది. ప్రాజెక్టు సెట్ అయ్యి సినిమాగా రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ మాత్రం గ్యాప్ సహజమే. నేను అనుకున్న కథలతోనే సినిమాలు చేస్తాను. అంతేకానీ స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలనే ఆలోచన నాకుండదు. ఈ చిత్రాన్ని మలయాళంలో ‘విస్మయం’ అనే పేరుతో విడుదల చేస్తున్నాం.
తదుపరి చిత్రాలు
ఈ సినిమా విడుదల తరువాత ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. దానిగురించి తర్వాత తెలియజేస్తా.

-శ్రీ