శ్రీరస్తు.. పాటల విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, సినిమా మ్యూజిక్‌ను విభిన్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన చేశామని, ఇదివరకే ‘సరైనోడు’ సినిమా మ్యూజిక్ కూడా అలాగే వెళ్లిందని, మొదటగా టైటిల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నామని, తరువాత ఒక్కో పాటను ప్రజల్లోకి తీసుకెళతామని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ, టైటిల్‌లో వున్నంత బ్లెజింగ్‌గా సినిమా వుంటుందని, కుటుంబ ఎమోషన్స్‌కి విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో ఫ్యామిలీ అంటే పక్కింటివాడి మేటర్ కాదు, మన ఫ్యామిలీది అనుకుంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చనే పాయింట్‌తో చేస్తున్న సినిమా ఇది అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ, మంచి ఫ్యామిలీ డ్రామ వున్న లవ్‌స్టోరీ ఇదని, దాంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ వుండదని, తమన్ అందించిన పాటలు హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు. ఈ చిత్రంలో లావణ్య అందంగా కనిపిస్తుందని, కొత్త జంట తరువాత మళ్లీ తనకు అవకాశం ఇచ్చారని అన్నారు. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, చాలా నేచురల్‌గా డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శిరీష్ చాలా కష్టపడి నటించాడని, తప్పకుండా ఈ సినిమా మా అందరికీ మంచి విజయాన్ని అందిస్తుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా:మణికంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:నాగరాజు, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:అల్లు అరవింద్, దర్శకత్వం:పరశురామ్.