తిక్క పాట పాడిన ధనుష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య స్టార్ హీరోలు గాయకులుగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ హీరో కోసం మరో హీరో పాట పాడుతూ ఆ సినిమాకు ఇంకాస్త క్రేజ్‌ను తెస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న ‘తిక్క’ సినిమాలో జరిగింది. ఇటీవలే సుప్రీమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయిధరమ్ తదుపరి చిత్రం ‘తిక్క’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రముఖ తమిళ హీరో ధనుష్ టైటిల్ సాంగ్ పాడాడు. తమన్ సంగీత దర్శకత్వంలో ఈ పాటను ఇటీవలే రికార్డు చేశారు. రామజోగయ్య శాస్ర్తీ రాసిన ఈ పాటను ధనుష్ ఫుల్ జోష్‌తో పాడినట్టు తమన్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత రోహన్‌రెడ్డి వివరాలు తెలియజేశారు. ‘మేం నిర్మిస్తున్న ‘తిక్క’ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే లడఖ్‌లోని అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించాం. సాయిధరమ్‌తేజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో ప్రత్యేకంగా ధనుష్‌తో ఓ పాట పాడించాం. ఆయన కూడా ఓ తెలుగు హీరోకి పాట పాడడం మొదటిసారి. ఈ పాట పాడినందుకు ధనుష్‌కు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రంలోని పాటలని ఈనెల 30న విడుదల చేసి ఆగస్టు 13న సినిమాను విడుదల చేస్తాం’ అని ఆయన అన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా తనకిష్టమైన నటుడు ధనుష్ పాట పాడడం మర్చిపోలేని అనుభూతని. నిజంగా సర్‌ప్రైజ్‌గా వుందని, ఈ సినిమా తప్పకుండా మా అందరికీ మంచి విజయాన్ని అందిస్తున్న నమ్మకం వుందని అన్నారు.