దెయ్యం పాత్రతో ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి సినిమా ‘ఒక మనసు’ సమయంలో ‘నిహారిక’ను మీడియా బాగా హైప్ చేసింది. మెగా కుటుంబంనుండి వస్తున్న హీరోయిన్ కనుక ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. దానికి తోడు ఆమె అశ్లీల చిత్రాల్లో నటించననీ, కుటుంబానికి మచ్చతెచ్చే పాత్రలు చేయనని చెప్పడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మినిమమ్ గ్యారంటీ అనుకున్న ‘ఒక మనసు’ కాస్తా ఒక్కరినీ మెప్పించకపోవడంతో, హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే చేదు అనుభవాన్ని చవిచూసింది. కథానాయికగా ప్రేక్షకులు ఒప్పుకున్నారా లేదా అనే విషయం కూడా అర్థంకాని పరిస్థితిని ఎదుర్కొంది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయింది. మళ్లీ తాజాగా మరో చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈసారి మాత్రం సెంటిమెంట్, ప్లస్ ఇపుడు హారర్ జోనర్‌కు బాగా ఆదరణ ఉన్న దృష్ట్యా కథనం ఎంపిక చేస్తోందట. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో సాగే కథనంలో దెయ్యం పాత్ర కూడా ఉండబోతోందట. కనుక ఈ చిత్రం అటు సెంటిమెంట్ నచ్చేవారికీ, హారర్ మెచ్చేవారికి అనువుగా ఉండబోతోందన్నమాట!