మహేష్ అత్తగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి నదియా అత్తగా నటిస్తే ఆ చిత్రం హిట్టవుతుందన్న సెంటిమెంట్ ‘అత్తారింటికి దారేది?’తో స్థిరపడింది! హీరోయిన్‌గా ఆమె నటిస్తున్న కాలంలో పట్టించుకోని టాలీవుడ్, ఇపుడు నదియాకు అవకాశాలపై అవకాశాలు ఇస్తోంది. అందాల అత్త పాత్రలో నదియా చేసిన నటన, ఆమె నటించిన ఆ చిత్రం అఖండ విజయం సాధించడం వంటి అంశాలతో మరోసారి వైవిధ్యభరితమైన కాంబినేషన్‌కు తెరలేచింది. అదే మహేష్‌బాబు-నదియాలు అత్తా అల్లుళ్లుగా నటిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన. దానికి మురగదాస్ కథ సిద్ధమైంది. మురగదాస్ దర్శకత్వంలో త్వరలో రూపొందించనున్న చిత్రంలో ‘అత్తగారు’గా నదియా నటిస్తోంది. ఇది కూడా అత్త సెంటిమెంట్ కథనం అవడంతో ఆమెనే ఎంపిక చేసింది చిత్ర బృందం. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. పవన్‌తో హిట్టిచ్చిన నదియా, మరోసారి తన మ్యాజిక్ చేసి, టాలీవుడ్ సెంటిమెంట్‌కు బలం చేకూరుస్తుందేమో చూడాలి?!