రవితేజ కొత్త సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రవితేజ ఈమధ్య చాలా వెనుకపడ్డాడు. ఆయన నటించిన బెంగాల్ టైగర్ సినిమా తరువాత దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఏ సినిమా సెట్స్‌పైకి రాలేదు. ఇప్పటికే రెండు మూడు కథలు రెడీగా వున్నా కూడా ఆయన ఏదీ కన్‌ఫర్మ్ చేయలేదు. రవితేజ కావాలనే సినిమాలు చేయడం లేదని, ఆయన ఆమధ్య కిక్-2 సమయంలో బాగా సన్నమయ్యాడుగా. ఆ లుక్ జనాలకు నచ్చలేదు. దాంతో మళ్లీ తన పాత ఫిగర్‌ని పెంచే పనిలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఏ సినిమా ఒకే చేయడంలేదని టాక్. ఇకపోతే లేటెస్టుగా ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట రవితేజ. కొత్త దర్శకుడు విక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమా చేసేందుకు ఓకె అన్నాడట. అయితే ఈ కథను ముందు సునీల్‌కి చెప్పాడని తెలిసింది. సునీల్ కాదన్న సినిమాను రవితేజ చెయ్యడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట!