సరిహద్దు దాటిన ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఎక్కలి రవీంద్రబాబు, రమణికుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘గల్ఫ్’ (సరిహద్దు దాటిన ప్రేమకథ). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, పిడికెడు మెతుకుల కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్‌కు వెళుతున్నవారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే అంశంతో దూరపు కొండలు నునుపు అనే సామెత మర్చిపోయినవారి కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, అక్కడికి వెళ్లినవారు సంతోషంగా ఉన్నారా? భారంగా జీవిస్తున్నారా? అనే కథ ఇందులో వుంటుందని తెలిపారు. ముళ్లమధ్య గులాబీలు అందంగా వికసించినట్లుగా అందులో ఓ అందమైన ప్రేమకథను కూడా ఈ చిత్రంలో చూపుతున్నామని తెలిపారు. సమస్య మూలాల్లోకి వెళ్లి బాధితులతో కలిసి మాట్లాడి, వారి వేదన ఆకళింపు చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించామని, ఇప్పటికే రెండు పాటల చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు. ఆగస్టు నెలాఖరుతో షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. సంతోష్ పవన్, చేతన్ మద్దినేని, అనిల్ కల్యాణ్, ఎల్.బి.శ్రీరాం, బిత్తిరి సత్తి, డింపుల్, పోసాని కృష్ణమురళి, నల్లవేణు, నాగినీడు, తీర్థ, దిగ్విజయ్, పింగ్‌పాంగ్, శివ, భద్రం, సోనం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా:ఎస్.వి.శివరాం, పాటలు:మాస్టర్‌జీ, కాసర్ల శ్యామ్, సిరాశ్రీ, మాటలు:పులగం చిన్నారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సునీల్‌కుమార్‌రెడ్డి.