మొదలైన డర్టీ గేమ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై ధీరేంద్ర, పూజిత జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీ గేమ్’. ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మనోహర్‌కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ నటీనటులందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారని, సురేష్ ఓ కీలకమైన పాత్రలో కన్పిస్తారని తెలిపారు. ఆగస్టు 4 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తిచేయనున్నామని తెలిపారు. రాజకీయ నేపథ్యంలో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుందని, డర్టీ గేమ్ అంటే ఏంటి? దానిని ఎవరు ఆడారు? చివరికి ఫలితాలు ఎలా వచ్చాయి అనే కథనంతో ఈ సినిమా సస్పెన్స్ రొమాన్స్, కామెడీ, ఎమోషన్లతో సాగుతుందని దర్శకుడు వెంకటేశ్వర శర్మ అన్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. అస్మిత, రమ్య, మనోహర్, జబర్దస్త్ బృందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కశ్యప్, నిర్మాత:తాడి మనోహర్‌కుమార్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.