మానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరులోని రజనీ అభిమానులు చెన్నైవచ్చి సినిమా చూడాలని తపిస్తారు. వారికోసం ఎయిర్‌ఏసియా ప్రత్యేక ఆఫర్లు ఇచ్చింది. ప్రయాణ చార్జీలు, వసతి, భోజనం, సినిమా టిక్కెట్లుతో కలపి రూ.7800ల ప్యాకేజీ ప్రకటించింది. ఎయిర్‌టెల్ ప్రత్యేక సిమ్, ప్యాకేజీలు ఇచ్చింది. వివిధ సంస్థలు సెలవులు, ఉచిత టిక్కెట్లు ఇచ్చాయి. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలు, రజనీ చొక్కాలు, వస్తువులు, కార్లు, బైక్‌లు, ఫ్లాష్‌మాబ్‌ల ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ఆహారోత్పత్తులకూ కబాలీ ట్రేడ్‌మార్క్ అయిపోయింది. ఇక వాహనాల నెంబర్‌ప్లేట్లకు, కబాలీ ప్రచారానికి లింకు పెట్టేశారు. ఇది భారతదేశ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు.
తొలగిన అడ్డంకి
పైరసీ జరగకుండా మద్రాస్ హైకోర్టు అండగా నిలిచింది. ఇప్పుడు మరో అడ్డంకి కూడా తొలగిపోయింది. రజనీతో తీసిన ‘లింగా’తో నష్టపోయామని, తమకు రావల్సిన 89 లక్షలు ఇచ్చేవరకు ‘కబాలీ’ విడుదల చేయరాదని ఆదేశించాలంటూ శుక్ర ఫిలిమ్స్‌కు చెందిన ఆర్.మహాప్రభు వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో కబాలీ విడుదలకు చివరి అడ్డంకి తొలగిపోయినట్లయింది.
అదుర్స్
అమెరికాలో ఉన్న రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేకంగా కబాలీ చిత్రాన్ని గురువారం రాత్రి చూశారు. ఆయనతోపాటు ఆ చిత్రాన్ని చూసిన అతికొద్దిమంది సహా రజనీ చాలా సంతృప్తి చెందినట్లు చెబుతున్నారు.