రజనీ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్ స్టైల్, డైలాగ్స్, పాటలు, సంగీతం ఇలా అన్ని విభాగాల్లో రజనీ స్టైలే వేరు. తన సినిమాల్లో వీటన్నింటికీ ప్రత్యేకత ఉండేలా చూసుకుని, తన నటనకు పదునుపెట్టి అభిమానులను అలరించడంలో రజనీకి ఎవరూ సాటిలేరు. వ్యక్తిగతంగానూ ఒదిగి ఉండే తత్వం, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయన శైలి. అభిమానులన్నా, తన సినిమాలను నిర్మించేవారన్నా ప్రత్యేక అభిమానం. తన సంపాదనలో సగం స్వచ్ఛంద సేవకు ఖర్చుచేయడం ఆయన ప్రత్యేకత. వయసుమీదపడుతున్నా యువకుడిలా నటించడం స్పెషాలిటీ. ఒక సినిమా ప్రారంభించాక, దాని షూటింగ్ పూర్తయ్యాక హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక, యోగా, ధ్యానంతో గడపడం అలవాటు. భక్తి, తాత్వికతపై ఎనలేని ఆసక్తి. అందుకే అతడికి భారతదేశంలో ఏ నటుడికీ లేనంతటి విలక్షణమైన గుర్తింపు దక్కింది. ఆ మధ్య వచ్చిన రోబో చిత్రంలో విలక్షణంగా ‘రోబో’ అంటూ సాగదీసి మాట్లాడిన డైలాగ్... చంద్రముఖిలో ‘లకలకలక’ అన్న డైలాగ్ ఎలా పేలాయో...ఇప్పుడు కబాలీ టీజర్‌లో విన్పించిన ‘నెరుప్పుడా’ (నిప్పునురా) అన్న పదం సినీజనానికి ఊతపదమైపోయింది. ఒకింత వ్యంగ్యంతోకూడిన స్వరంతో, మూతిని వంకరతిప్పి, చేతివేళ్లను తమాషాగా తిప్పుతూ ‘నెరుప్పుడా’ అని పలికిన పలుకు రజనీ అభిమానులకు ఓ పిలుపై కూర్చుంది. గత నెలరోజులుగా కబాలీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుడి మోము ఇప్పుడు మతాబుల్లా వెలిగిపోతోంది. తమ వెండితెర వేల్పును చూసేందుకు వారు సిద్ధమైపోయారు...ఇంటిల్లిపాదితో...అదీ రజనీ మాయ.