నిప్పునురా..వచ్చితిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ ప్రపంచం ఇప్పుడు కబాలీ జ్వరంతో ఊగిపోతోంది. దేశం, మతం, భాష, చిన్నా పెద్దా అన్న తేడాయేం లేదు. సినిమాలపై ఇష్టం ఉన్నవారంతా ఇప్పుడు కబాలీ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తనదైన స్టైల్‌తోకూడిన నటన, ట్రిక్స్, పవర్‌ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను మైమరపింపచేసే అద్భుత నటుడు రజనీ 159వ చిత్రం కబాలీ. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలవుతున్న ఆ చిత్రాన్ని మొదటి షో చూడాలని తపిస్తుస్తున్న వారికి ఇప్పుడు పెద్దపండగే! సినిమా రూపొందాక ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు నిర్మాతలు, యూనిట్ పెద్దవ్యూహానే్న రచిస్తాయి. సెలవులు, పోటీ సినిమాలు లేని సమయం, మార్కెటింగ్ ఇలా అన్నీ లెక్కలు చూసుకుని విడుదల చేస్తాయి. రజనీ సినిమాలకు ఆ భయం లేదు. ఎందుకంటే అతడి సినిమా వస్తే ప్రేక్షకులు సెలవులు పెట్టేస్తారు. సంస్థలు సెలవులు ఇచ్చేస్తాయి. అదోరకం పిచ్చి అనుకుందాం. కబాలీ కోసమైతే సంస్థలే సెలవులు ఇచ్చేసాయి. పనిలోపనిగా టిక్కెట్లూ కొనిచ్చేసాయి. తమిళనాడులో కబాలీ టిక్కెట్ల కోసం సిఫారసు లేఖలు ఇవ్వాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
**
ఇదీ లెక్క
ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి అయిన ఖర్చు రూ. 100 కోట్లు. తొలి మూడురోజుల్లోనే 200 కోట్లు వస్తుందని నిర్మాత ఆశిస్తున్నాడు. మొత్తం ఈ సినిమా 700 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందన్న అంచనా ఉంది. బాలీవుడ్ సినిమా ‘సుల్తాన్’ను తోసిరాజనేలా ఈ చింత్రంపై అంచనాలున్నాయి. ఆ మధ్య సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ని మించి ఉత్కంఠ రేపిన చిత్రం ఇదే. ఈ చిత్రం నిడివి 152 నిమిషాలు. నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయి. ఓ ఫైట్ సన్నివేశంలో రజనీ ఎంట్రీతో సినిమా ప్రారంభమవుతుంది.