త్వరలో అరకురోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్‌శంకర్ మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, షూటింగ్ చాలావరకూ పూర్తయిందని, థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. అన్ని రకాల కమర్షియల్ అంశాలు మేళవించి పూర్తి యాక్షన్ తరహాలో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, కథ సరికొత్తగా వుంటుందని, రామ్‌శంకర్ కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా నిలుస్తుందని దర్శకులు వాసుదేవ్ తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించామని, అన్ని రకాల కమర్షియల్ అంశాలు మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అందిస్తుందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సురేష్ వర్మ అన్నారు.