చిన్న సినిమా బతకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థియేటర్స్ లీజు, డిజిటల్ టెక్నాలజీపై చిన్న నిర్మాతలు ధర్నా చేశారు. క్యూబ్, యుఎస్‌ఒ రేట్లు తగ్గించాలని పోరాటం చేస్తున్న నిర్మాత ఆర్.కె.గౌడ్‌కు మిగతా నిర్మాతలు సంఘీభావం ప్రకటించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమా థియేటర్లు, క్యూబ్, యుఎస్‌ఒ సిస్టమ్స్ కొందరు సినిమా పరిశ్రమ పెద్దల చేతుల్లో వున్నాయి. దానివల్ల చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరకడంలేదు. ఒకవేళ దొరికినా క్యూబ్, యుఎస్‌ఒల పేరిట వారానికి 10,800 నుండి 12000ల వరకూ వసూలు చేస్తున్నారు. అదే పక్క రాష్ట్రాల్లో ఒక వారానికి 2,300 నుండి 2,500 వరకు వసూలు చేస్తున్నారు. మన దగ్గర ఇంత ఎక్కువ వసూలు చేసి నిర్మాతలను అన్యాయం చేస్తున్నారు. ఒక థియేటర్‌లో సినిమా విడుదల చేస్తే, ఒక వారానికి క్యూబ్, యుఎస్‌ఒల ద్వారా నిర్వాహకులకు నిర్మాత 2,50,000 వసూలు చేస్తున్నారు. నిజానికి వసూలుచేయవలసింది 1,30,000 మాత్రమే. ఇలా అడ్డదిడ్డంగా ఎందుకు వసూలు చేస్తున్నారు? దీంతో చిన్న నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్న నిర్మాతలను ఇబ్బందులను పెట్టి కోట్లు గడిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా మోసం చేస్తున్నారు. ఇదంతా కొంతమంది సినీ పెద్దల కనుసన్నల్లో జరుగుతూ ఓ మాఫియాలో తయారైంది. కలిసికట్టుగా పరిశ్రమను దోపిడీ చేస్తున్నారు. చిన్న నిర్మాతలను నిట్టనిలువుగా ముంచేస్తున్నారు. ఈ దోపిడీ వ్యవస్థనుండి పరిశ్రమను కాపాడాలి. థియేటర్లలో లీజు పద్ధతి కాకుండా పర్సెంటేజ్ విధానంలో నడిపినపుడే చిన్న నిర్మాత బతికి బయటపడతాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందేమోకానీ, తెలుగు పరిశ్రమకు మాత్రం ఇంకా రాలేదు. చిన్న సినిమా బతకాలని మా పోరాటం. అందుకే ఈ ధర్నాతో మొదలుపెట్టాం. త్వరలోనే క్యూబ్, యుఎస్‌ఒ నిర్వాహకుల ఆఫీసులముందు నిరాహారదీక్ష చేస్తాం. ఈ దీక్ష రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించేవరకూ మా పోరాటం ఆగదు అన్నారు.