బంగారంలాంటి బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బాబు బంగారం’. చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 12న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ..‘విక్టరీ వెంకటేష్, నయనతార కాంబినేషన్‌లో వరుస సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో మా బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పైన, బాబు బంగారం చిత్రాన్ని నిర్మించాం. దీనికి సంబంధించిన మొదటి లుక్ టీజర్, సింగిల్ ట్రాక్‌కి అన్ని వర్గాల ప్రేక్షకులనుండి చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిలవటం చాలా హైప్‌గా వుంది. చిత్రాన్ని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. ఈ చిత్రం వెంకటేష్‌గారి అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని చక్కగా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. వెంకటేష్ కెరీర్‌కి ఓ మంచి చిత్రంగా నిలుస్తుందనీ, బాబుబంగారంగా ఎలా మంచి పేరుతెచ్చుకున్నాడనే ఆసక్తికర కథనంతో దర్శకుడు, అందరికీ నచ్చేవిధంగా తెరకెక్కించారని వారు తెలిపారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్, మురళీశర్మ, వెనె్నల కిషోర్, మున్నా వేణు, గిరిధర్, అనంత్, రాజారవీందర్, రజత, గుండు సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్- ఉద్దవ్.ఎస్.బి, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్, కథ, కథనం, దర్శకత్వం- మారుతి.