సిక్స్‌ప్యాక్‌లో కళ్యాణ్‌రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది పటాస్ విజయంతో మళ్లీ తన హవాను క్రియేట్ చేసుకున్న కళ్యాణ్‌రామ్, ఇపుడు భిన్నమైన ఇమేజ్‌ను తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఇజం’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. పూరి మార్క్ స్టైల్లో హీరోలందరూ భిన్నంగా కనిపిస్తుంటారు. ఇందులో కూడా కళ్యాణ్‌రామ్ చాలా కొత్తగా కన్పిస్తాడని తెలిసింది. ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఆయన సిక్స్‌ప్యాక్‌తో షాక్ ఇవ్వనున్నారట. ఇప్పటికే పది కిలోల బరువు తగ్గి సిక్స్‌ప్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడట. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకే ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో సిక్స్‌ప్యాక్ చేసి అందరికీ షాక్‌ఇచ్చిన సంగతి తెలిసిందే.