సిద్ధవౌతున్న అభినేత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, తమన్నా జంటగా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అభినేత్రి’. ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గూర్చి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, ‘మూడు భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఎస్.ఎస్.్థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్ కలిసి మొదటిసారిగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తాం’ అన్నారు. నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘ప్రభుదేవా, తమన్నా వంటి టాప్ ఆర్టిస్టులతో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా వుంది. టీజర్‌కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఈ చిత్రంపై మాకు వున్న నమ్మకాన్ని రెట్టింపుచేసింది. ఈ చిత్రం తమన్నాకు మంచి పేరు తెస్తుంది. సోనూసూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: మనీష్‌నందన్, ఎడిటింగ్: ఆంటోనీ, ఆర్ట్: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్.