దృశ్య కావ్యంగా ‘లవ్ కె రన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపక్ సరోజ్, మాళవికా మీనన్ జంటగా కందిమల్ల మూవీ మేకర్స్ పతాకంపై సి.కళ్యాణ్ సమర్పణలో కందిమల్ల వెంకట చంద్రశేఖర్ రూపొందించిన చిత్రం ‘లవ్ కె రన్’ (సేవ్ లవ్). కోటపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ, సాంకేతిక విలువలతో దృశ్యకావ్యంగా రూపొందించారన్నారు. ప్రేమకథలు ఎప్పుడు విజయవంతం అవుతాయని, వైవిధ్య భరితంగా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు కూడా ఆకర్షణగా నిలిచాయన్నారు. ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవడం ఒక కోణమైతే, ప్రేమించుకుని విడిపోయి పెద్దలు కుదిర్చన పెళ్ళి చేసుకోవడం మరో కోణమైతే ఈ రెండు కాకుండా ప్రేమలో మూడో కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు కోటపాటి శ్రీను తెలిపారు. ప్రేమికులకు సమస్యలు ఎదురైనప్పుడు శక్తి పుంజుకుని పోరాడాలే తప్ప ప్రాణాలు తీసుకోకూడదని ఈ చిత్రంలో తాము చెబుతున్నామని అన్నారు. ఆరోగ్యం కోసం ‘టూ కె రన్’ ఎలా చేస్తుంటారో అలాగే ప్రేమకోసం పరుగు తీస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం చెబుతుందన్నారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత కందిమల్ల చంద్రశేఖర్ అన్నారు. కృష్ణ్భగవాన్, వినోద్‌కుమార్, సత్యప్రకాష్, తా.రమేష్, రచ్చరవి, హేమ, సన, మాధవి, రాకేష్, రవికిరణ్, జయంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: సి.కళ్యాణ్, దర్శకత్వం: కోటపాటి శ్రీను.