ఇక పెళ్లేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించిన పెళ్లి వార్తలు అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. హిందీలో రణవీర్‌సింగ్ సరసన చేసే సినిమాతో ఆమె బాలీవుడ్‌కి బైబై చెప్పనుందని సమాచారం. పెళ్లిచేసుకుని నటనకు స్వస్తి చెప్పాలని ఆలోచిస్తోంది. ముంబయికి చెందిన తన కుటుంబానికి ఆప్తులైన వ్యక్తితో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని వినికిడి. కంప్యూటర్ ఇంజనీర్‌గా ఉన్నతమైన స్థితిలో ఉన్న అతనితో జీవితాన్ని పంచుకోవడానికి తమన్నా సిద్ధవౌతోంది! ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేసుకుని, పెళ్లయ్యాక తాను నెలకొల్పిన గోల్డ్ డిజైన్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకోడానికి సిద్ధవౌతోందామె. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతోపాటుగా బాహుబలి-2 సినిమాలో నటించడానికి తమన్నా ఈగర్‌గా వెయిటింగ్ చేస్తోంది. చూద్దాం.. పెళ్లిచేసుకుంటుందో లేక కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందో!