రామసక్కని రాకుమారుడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్, స్వప్న జంటగా రూపొందించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’ ఆడియో సీడీని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ విడుదల చేసి తొలి కాపీని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు అందించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, కొత్త నటీనటులైనా బాగా నటించారని, ఉదయ్ దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ప్రతిభ చూపారని అన్నారు. తెలుగువాడైన ఉదయ్ సినిమా మీద వున్న అభిరుచితో కెనడాలోనే షూటింగ్ పూర్తిచేశారని, ఆడియోతోపాటు సినిమా హిట్ కావాలని నిర్మాత ప్రతాని రామకృష్ణ అన్నారు. పాటలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకం వుందని సంగీత దర్శకుడు హేమచంద్ర అన్నారు. ఈ సినిమా కోసం తాను మూడేళ్లపాటు కష్టపడ్డానని, కెనడాలో చిత్రీకరించిన తొలి తెలుగు చిత్రం ఇదేనని, సందేశాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు ఉదయ్ అన్నారు. కార్యక్రమంలో సాయి వెంకట్, సాగర్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:రమేష్ సెల్వరాజ్, కెమెరా:కోబీ రాజరత్నం, సుజన్ జగన్నాథన్, సంగీతం:హేమచంద్ర, నిర్మాతలు:హారికా కల్లూరి, ఉదయ్ కల్లూరి, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ కల్లూరి.