ఆగస్టు 12న మెంటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, అక్ష హీరో హీరోయిన్లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్, సుబ్రమణ్య ఆర్ట్‌క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మెంటల్’. కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘ఇందులో సిన్సియర్ పోలీసు ఆఫీసర్‌గా కనపడతాను. రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా, చివరకు కట్టుకున్న భార్య అయినా క్షమించని పాత్ర నాది. ‘మెంటల్ పోలీస్’అని మొదట అనుకున్నా కోర్టు వివాదం ఫలితంగా ‘మెంటల్’గా విడుదలవుతోంది. నేను నెగెటివ్ రోల్స్‌లో చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. ననె్నవరూ అలాంటి పాత్రలకు సంప్రదించలేదు. నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను. ఇక మా అబ్బాయి నటించిన నిర్మలా కానె్వంట్ చిత్రం వచ్చే నెలలో విడుదల కావచ్చు..’ అన్నారు. దర్శకుడు కరణం బాబ్జీ మాట్లాడుతూ, ‘టైటిల్‌పై వివాదం కోర్టులో ఉండటంతో సినిమా విడుదల ఆలస్యమైంది. చచ్చినా బతికినా పోలీస్‌గానే ఉండాలనే పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.’అని తెలిపారు.