19న సాహసం శ్వాసగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిరియాల రవిందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాగచైతన్య, ఎ.ఆర్.రెహమాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలయికలో మరోమారు వస్తున్న ఈ మ్యూజికల్ సెనే్సషనల్ హిట్ చిత్రం ఏమాయ చేసావె చిత్రంకన్నా మరింత విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ఓ అందమైన ప్రేమకథను అద్భుతమైన దృశ్యకావ్యంగా మలచిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, గౌతమ్‌మీనన్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంలో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగిస్తుందని ఆయన అన్నారు. సరికొత్త కథనంతో రూపొందించిన ఈ చిత్రం విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందించామని అన్నారు.