పోస్ట్ ప్రొడక షన్‌లో ఆమె అతడైతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె.. అతడైతే’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక నిర్మాతలు తెలియజేశారు. చిత్ర దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ, ‘పల్లెటూరు నుండి ఓ కుర్రాడు సిటీకి వచ్చి తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించుకున్నాడనే కథాంశంతో లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆమె.. అతడైతే టిఫరెంట్ టైటిల్. కథకి సరిగ్గా సరిపోతుంది. క్లాసికల్ డాన్సర్‌గా గుర్తింపు ఉన్న హనీష్ హీరోగా నటిస్తున్నారు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది’ అన్నారు.
నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ, ‘డైరెక్టర్ సూర్యనారాయణ చెప్పిన పాయింట్ చాలా ఇంప్రెసివ్‌గా వుండడంతో జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈనెలలోనే ఆడియోను రిలీజ్ చేసి నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
భానుచందర్, అలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు నటిటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:యశోకృష్ణ, కెమెరా:హనుకాక, పాటలు:సుద్దాల అశోక్ తేజ, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:కె.సూర్యనారాయణ.