శరవేగంగా 4న4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత్, ప్రియాంక హీరో, హీరోయిన్లుగా చేజర్ల ఇంద్రకుమార్ రాజు సమర్పణలో అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్‌పై శివ (అపురూప్) స్వీయ దర్శకత్వంలో 4న4 చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ, నలుగురు స్నేహితుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనను ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాను. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం ద్వారా తమ కుటుంబ సభ్యుడైన ప్రశాంత్‌తోపాటు మరో ముగ్గురు కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తున్నామన్నారు. ఎడిటర్ కోలా భాస్కర్ మాట్లాడుతూ ఈ సినిమా మంచి చిత్రం అవుతుందన్నారు. హీరో ప్రశాంత్ మాట్లాడుతూ, ‘కథ నచ్చి ఒప్పుకున్నాను. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. లవ్‌స్టోరీతోపాటు అన్ని అంశాలు ఉంటాయి’ అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ నిహాల్ మాట్లాడుతూ, సింగర్ అయిన తాను మొదటిసారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నానని, మ్యూజిక్‌కు మంచి స్కోప్ ఉందని తెలిపారు. ప్రశాంత్, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో తా.రమేష్, వేణు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:నిహాల్, కెమెరా:నాని చమిడి శెట్టి, కథ సహకారం:సాయి సునీల్, మాటలు:క్రాంతి సకినాల, ఫైట్స్:దేవరాజ్, నిర్మాణం:అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శివ (అపురూప్).