సూర్య, పా రంజిత్‌ల 5.35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ‘కబాలి’ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు అందుకున్న సినిమా. ఇక విడుదల తరువాత ఫలితం ఎలా ఉన్నాసినిమా మాత్రం బాక్స్ ఆఫీసువద్ద దుమ్ము లేపింది. ఆ సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు పా రంజిత్. ఈ సినిమా తరువాత ఆయనకు అవకాశాలు జోరుగా వస్తున్నాయి. సూర్య హీరోగా ఓ సినిమా చేయడానికి కమిట్ అయినట్టు తెలిసింది. ఇటీవలే సూర్య ‘24’ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ప్రయోగాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రశంసలు అందుకున్నా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఇక ప్రస్తుతం ‘సింగం 3’ చిత్రంలో నటిస్తున్న సూర్య ఈ సినిమా తరువాత పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటిస్తాడట. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఓ కొత్త టైటిల్‌ని ఫిక్స్ చేసారు. అదేంటో తెలుసా.. 5.35.!! సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.