ఆవు-పులి.. మధ్యలో ప్రభాస్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.రవితేజ, అశ్వినీ చంద్రశేఖర్, భానుశ్రీ ప్రధాన తారాగణంగా ఎస్.జె.చైతన్య దర్శకత్వంలో రవి పచ్చిపాల రూపొందిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, తొలిసారిగా ప్రభాస్ అభిమానుల కోసం రూపొందిస్తున్న చిత్రం ఇదని, చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశామన్నారు. ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు జరుపుతున్నామని, మంచి రెస్పాన్స్ లభిస్తోందని అన్నారు. బ్లాక్ కామెడీతో విభిన్న శైలితో నెల్లూరు నేపథ్యాన్ని భాషను ఈ సినిమాలో ఉపయోగించామని తెలిపారు. వేణు, అప్పారావు, ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఎం.టి.కవిశంకర్, కెమెరా:అర్లీ, రచన, దర్శకత్వం:ఎస్.జె.చైతన్య, నిర్మాత:రవి పచ్చిపాల.