కామెడీతో మయసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రంశ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవ, కోటయ్య, రమణారెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మయసభ’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రంలో సరికొత్త కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, ఖమ్మం, మైలవరం, హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ జరిపామని, నాలుగు పాటలు ఉన్నాయని తెలిపారు. ఆద్యంతం ఈ చిత్రం కామెడీతో ప్రేక్షకులకు నచ్చుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నీ సినిమాలో వున్నాయని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. చింటూ, జూ.రేలంగి, షకలక శంకర్, రాధ, రమణారెడ్డి, దేవా, కోటయ్య తదితరులు నటిస్తున్నారు.