భారీ ఓపెనింగ్స్‌తో జక్కన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడిగా రూపొందించిన ఏ చిత్రానికీ రానంత భారీ వసూళ్లు తొలిరోజే జక్కన్న చిత్రం సాధించిందని నిర్మాత సుదర్శన్‌రెడ్డి తెలియజేస్తున్నారు. ఆర్‌పిఎ క్రియేషన్స్ పతాకంపై సునీల్, మన్నార్ చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో జక్కన్న విడుదలైన సంగతి తెలిసిందే. జక్కన్న చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేశామని, సునీల్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందన్నారు. అన్ని కేంద్రాల నుండి మంచి రిపోర్టులు వస్తున్నాయని, ముఖ్యంగా తామనుకున్న విధంగా కామెడీ థియేటర్లలో మారుమోగుతోందని, ముఖ్యంగా అన్ని కేంద్రాల్లో భారీ ఓపెనింగ్స్ రావడం సినిమాలో వున్న వైవిధ్యాన్ని తెలిజేస్తోందని తెలిపారు.