సిద్ధమైన చల్ చల్ గుఱ్ఱం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందించిన చిత్రం ‘చల్ చల్ గుఱ్ఱం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్నా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, కథపై వున్న నమ్మకంతో తాము ఈ చిత్రాన్ని రూపొందించామని, ఎమోషనల్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామన్నారు. దాదాపు 34 పాత్రలున్నా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఈ కథ సాగుతుందని, యూనిక్ కానె్సప్ట్‌తో మనుషుల మధ్య వస్తు సంబంధం కాకుండా సంస్కార బంధం వుండాలన్న కోణంలో కార్పొరేట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ చిత్రాన్ని తాము రూపొందించామన్నారు. ప్రతి డైలాగ్‌లో కామెడీ వినిపిస్తోందని, దానివెనుక కొన్ని నగ్న సత్యాలు కూడా వుంటాయని తెలిపారు. వెంగీ సంగీతం అందించిన ఆడియో ఇప్పటకే సూపర్‌హిట్‌గా నిలిచిందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు. నాగబాబు, బెనర్జీ, అశోక్‌కుమార్, చిట్టిబాబు, ముక్తార్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, సుడిగాలి సుధీర్, అంబటిశ్రీను, హర్ష, జోగినాయుడు, కృష్ణంరాజు, తిరుపతి ప్రకాష్, దువ్వాసి మోహన్, జూ.రేలంగి, మీనా, శిల్పా నటించిన ఈ చిత్రానికి సంగీతం:వెంగీ, కెమెరా:వి.శ్యాంప్రసాద్, ఎడిటింగ్:శంకర్, నిర్మాత:ఎం.రాఘవయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మోహన్ ప్రసాద్.