సెప్టెంబర్‌లో ‘దండుపాళ్యం 2’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజా గాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న ‘దండుపాళ్యం 2’ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ‘40 రోజులపాటు ఏకధాటిగా బెంగళూరు, బెల్గామ్‌ల్లో చాలావరకూ షూటింగ్ సీక్వెల్‌లో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది’ అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ,‘బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం కన్నడంతో పాటు తెలుగులోనూ శతదినోత్సవం జరుపుకుంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.