గరుడ ఎవరికోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల వ్యాప్తి చేసి కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించిన దర్శకుడు ధీరుడు రాజవౌళి ప్రస్తుతం ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘బాహుబలి’ని మించిన విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు రాజవౌళి. ప్రస్తుతం మరో సినిమా చర్చలోకి వచ్చింది. దక్షిణాది క్రేజీ దర్శకుడిగా మారిన రాజవౌళి ‘గరుడ’ అనే పేరుతో ఓ సినిమా చేస్తాడని వార్తలు జోరందుకున్నాయి. ఇటీవలే చెన్నైలో ఈ విషయం గురించి కొందరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘గరుడ సినిమా వుంటుంది. కానీ, దాని గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతానికి దానికి సంబంధించిన స్టోరీ లైన్ మాత్రమే నా దగ్గర వుంది. కథ రెడీ చేయాలి’ అని స్వయంగా చెప్పడం విశేషం. దాంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటిస్తాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇంకా కథే రెడీ చేయలేదని, అపుడే నటీనటులను ఎలా ఎంపిక చేస్తానని అన్నాడు రాజవౌళి. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా బహుబలి-2పైనే వుంది. మరి, గరుడ ఎవరికోసం?