సీనియర్ నటుడు సి.కె.విశ్వనాధ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాధ్ ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్ నుండి వైజాగ్ వెళుతుండగా, ఖమ్మం సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం యన మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారని తెలిసింది. దాదాపు 60 సినిమాలకుపైగా రచయితగా పనిచేశారాయన. ప్రముఖ దర్శకులు దాసరి నారాయయణరావు, రేలంగి, విజయబాపినీడుల చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తన సంతాపాన్ని వ్యక్తంచేశారు.