అనుష్కశర్మ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హాట్‌భామ అనుష్కశర్మ ఈమధ్య జోరుమీదుంది. వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తూ, మరోవైపు జోరుగా విరాట్‌కోహ్లీతో ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ ఇప్పుడు ఓ విషయానికి అడిక్ట్ అయిపోయిందట. దర్శక నిర్మాతలు ఈ విషయం విని షాక్ అవుతున్నారు. ఈ వ్యసనంవల్ల అనుష్క కెరీర్ నాశనం చేసుకుంటుందా ఏమో అని? ఔనా.. ఇంతకీ దేనికి అడిక్ట్ అయ్యిందనేగా మీ అనుమానం. ఆ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పోకీమాన్ గేమ్ గురించే. ఔను కాల్పనిక వరల్డ్‌ను క్రియేట్ చేసిన ఈ ఆట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఆట ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో అనుష్కశర్మ తన ఫోన్‌లో ఈ గేమ్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తోందట. అసలు అనుష్క పరిస్థితి చూస్తుంటే ఈ గేమ్‌కు అడిక్ట్ అయినట్టే వుందని చెబుతున్నారు సినీ జనాలు. దానికితోడు ట్విట్టర్‌లో నేను ఈ గేమ్‌లో పడిపోయా అంటూ కామెంట్ పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌లో కొందర్ని ఈ గేమ్ గంటలు గంటలు ఆడిస్తోందట. అనుష్క కూడా ఈ రేంజ్‌లో ఆ గేమ్ ఆడితే కెరీర్ స్పాయిల్ అవుతుందని ఆమెకు హెచ్చరికలు కూడా చేస్తున్నారట. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో ఈ గేమ్ పిచ్చి పాకిపోతోందట!