ప్రయోగాల ఇంకొక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తదనంకోసం ప్రయత్నించే నటుల గురించి చెప్పాలంటే ముందుగా కోలీవుడ్డే గుర్తుకొస్తుంది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కమల్‌హాసన్ తరువాత ఆ స్థాయిలో ప్రయోగాలు చేస్తున్న నటుడు విక్రమ్. ఇప్పటికే పలు రకాల పాత్రలు పోషించి ఆకట్టుకున్న విక్రమ్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘యిరుమగన్’. తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లు. ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో విక్రమ్ కన్పిస్తాడని తెలిసింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా విక్రమ్ రెండు మూడు గెటప్‌లలో కనిపించడం అందరికీ షాక్‌నిచ్చేలా వుంది. ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది.