బాల దర్శకత్వంలో ఎన్టీఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ కొత్త సినిమాపై మీడియా వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, నిజ జీవిత పాత్రలతో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సినిమాలు తీసే బాల దర్శకత్వంలో నటిస్తాడనేది ఇప్పుడు అందరినీ ఆశ్ఛర్యపరుస్తున్న వార్త. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఓ సందర్భంలో బాలని కలిశాడని ఆయనతో జనతా గ్యారేజ్ షూటింగ్ గురించి, ఎన్టీఆర్ గురించి చర్చించాడని తెలిసింది. మోహన్‌లాల్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెబుతుంటే బాలకి ఆయనతో సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందని వార్తలు వస్తున్నాయి. విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బాల ‘శివపుత్రుడు’ సినిమాకు జాతీయ అవార్డును అందుకున్నాడు. మరి అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తే నిజంగా సంచలనమే అవుతుంది. ఇప్పటికే బాలతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్లు ఎదురుచూస్తున్నారు. మరి ఎన్టీఆర్‌తో బాల చేసే సినిమా నిజంగా నిజమైతే అంతకన్నా సంచలనం మరోటి లేదు. మరి బాలతో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి!