డర్టీగేమ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, ఖయ్యూం ముఖ్యపాత్రల్లో వెంకటేశ్వర శర్మ అక్కపెద్ది దర్శకత్వంలో షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్‌కుమార్ నిర్మిస్తున్న ‘డర్టీగేమ్’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, నటుడు సురేష్‌తో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. రాజకీయ నేపథ్యంలో నడిచే సినిమా ఇది. ఈ సినిమా చూసి ఒక్క ఎమ్మెల్యే మారినా, మా నిర్మాత మనోహర్ జీవితం ధన్యమైనట్లే. కథ అంత బాగా వచ్చింది అన్నారు. సురేష్ మాట్లాడుతూ, రియాలిటీకి దగ్గరగా వుండే కథ ఇదని, మంచి టీమ్‌తో తెరకెక్కిస్తున్నామన్నారు. నిర్మాత మనోహర్ మాట్లాడుతూ, సినీరంగంతో తనకు పెద్దగా పరిచయం లేదు కానీ, సినిమాలు తీయాలన్న ఆసక్తితో వచ్చానని, మంచి సీనియర్ నటీనటులతో ఈ సినిమా చేస్తున్నామని, రాజకీయ నేపథ్యంతో మెసేజ్ వున్న కథ ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కశ్యప్, నిర్మాత:తాడి మనోహర్‌కుమార్, దర్శకత్వం:అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.