సెన్సార్‌కు కారులో షికారుకెళితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధీరు మహేష్, సుదర్శన్, సురేష్, ఇషికాసింగ్, ప్రియాంక ప్రధాన తారాగణంగా శ్రీ హరిహరా ఫిలింస్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరామ్ రూపొందిస్తున్న చిత్రం ‘కారులో షికారుకెళితే’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్‌కు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాదాల కోటేశ్వరరావు మాట్లాడుతూ, యూత్‌కు కావాల్సిన అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా రూపొందించామని, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సెన్సార్ పూర్తయ్యాక వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఆయన అన్నారు. యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని, తప్పక మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం వుందని నిర్మాతలు తెలిపారు. జీవా, ఫణి, రాము తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:మీనాక్షి భుజంగ్, ఎడిటింగ్:వి.ఆర్.ఆనంద్, మాటలు:లక్కి, ప్రదీప్ నామాని, నిర్మాతలు:మధు, అనీష్, అభిరామ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మాదాల కోటేశ్వరరావు.