ఇజం కోసం పూరి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ దర్శకుల్లో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది ‘పూరీ జగన్నాథ్’. దర్శకత్వమేగాక ఈయనకు రచయితగా కూడా మంచి పేరుంది. సినిమాకి అవసరమైతే డైలాగులు, పాటలు కూడా రాస్తుంటాడు పూరి. తాజాగా ఆయన ‘కల్యాణ్‌రామ్’ హీరోగా ‘ఇజం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశంకోసం పూరి పాట రాస్తున్నారు. అది ఏ సందర్భంకోసం, ఎలాంటి పాట అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్స్‌తో కనిపించనున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌పై కళ్యాణ్‌రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.