భారతీయ మహిళల గురించి తెలుసుకుని నటించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, లారిస్సా బొనెసి, మన్నార చోప్రా హీరోయిన్లుగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వరా మూవీ మేకర్స్ పతాకంపై రోహన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది బ్రెజిల్ భామ లారిస్సా బొనెసి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయిన సందర్భంగా హీరోయిన్ లారిస్సా బొనెసితో ఇంట ర్వ్యూ..

* మీ గురించి?
- నేను బ్రెజిల్‌కి చెందిన అమ్మాయిని. ఇక్కడ మోడలింగ్ చేశాను.
* ఈ అవకాశం ఎలా వచ్చింది?
- పదేళ్లుగా మోడలింగ్‌లో ఉన్నాను. 2011 నుండి ఇండియాలోనే మోడలింగ్ చేస్తున్నాను. నేను నటించిన మహీంద్రా గస్టో యాడ్ చూసిన నిర్మాత ఈ సినిమా కోసం హీరోయిన్ కావాలని నన్ను సంప్రదించారు. అలా ఆయన్ను కలిసిన తరవాత ఈ కథ చెప్పి ఇందులో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు.
* తిక్కలో మీ పాత్ర గురించి?
- ఇందులో నాది చాలా మంచి పాత్ర. లలీ గర్ల్‌గా ఉంటూనే ఎమోషన్స్ ఉన్న అమ్మాయి. అలాగే చాలా సాఫ్ట్ క్యారెక్టర్. అన్నీ కలిసిన మంచి అమ్మాయిలా కనిపిస్తా.
* భాష సమస్య కాలేదా?
- మొదట్లో చాలా కష్టం అనిపించింది. కానీ షూటింగ్ సమయంలో ఓ టీచర్‌ను పెట్టించుకుని నేర్చుకున్నా. ఇండియన్ అమ్మాయిలు ఎలా ఉంటారు, ఎలా స్పందిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న చాలా విషయాలు నేర్చుకున్నా. సో.. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదు.
* మరి కోస్టార్ ధరమ్ గురించి?
- తను చాలా ఫ్రెండ్లీ. నిజంగా అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా అతని హార్డ్‌వర్క్, డెడికేషన్ చూసి చాలా షాక్ అయ్యా. తను ఎంతో సపోర్టు అందించాడు. ఇప్పుడు మేము బ్రెస్ట్‌ఫ్రెండ్స్ అయ్యాము.
* దర్శకుడు సునీల్‌రెడ్డి గురించి?
- సునీల్ చాలా టాలెంటెడ్ పర్సన్. తను చాలా స్పీడ్. సినిమా గురించి ప్రతి విషయంలో అతని ఇన్‌వాల్వ్‌మెంట్ సూపర్. తనతో నా ఫస్ట్ సినిమా చేయడం లక్కీ అని చెప్పాలి. అలాగే నిర్మాత రోహన్‌రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను ప్యాషన్‌గా తీశాడు.
* మిగతా ఆర్టిస్టుల గురించి?
- ఇందులో నాతోబాటు మన్నారా చోప్రా కూడా నటించింది. ఇద్దరం బాగా క్లోజ్‌ఫ్రెండ్స్ అయ్యాం. అలాగే రాజేంద్రప్రసాద్, రఘుబాబు ఇలా చాలామంది సీనియర్స్‌తో పనిచేయడంతో చాలా నేర్చుకున్నా.
* హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేస్తారా?
- మంచి సినిమాల్లో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా.
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంది.

- శ్రీ