ట్రెండ్ మార్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సల్మాన్ హీరోగా వచ్చిన ‘వీర్’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రవేశించింది అందాల భామ జరీన్‌ఖాన్. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పాపం ఆమె ఆశలన్నీ నిరాశలయ్యాయి. అయినా కూడా అడపా దడపా వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంది. అరడజనుపైగా సినిమాలు చేసినా కూడా పెద్దగా కెరీర్‌కు ఉపయోగపడలేదు. దాంతో ట్రాక్ మార్చిన ఈ భామ, అడల్డ్ కంటెంట్‌తో రూపొందిన ‘హేట్‌స్టోరీ-3’ చిత్రంలో నటించి సంచలనం రేపింది. ఆ సినిమా ఒక్కసారిగా బాలీవుడ్‌లో హంగామా క్రియేట్ చేసింది. హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శనతో జరీన్ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చింది. అంతే.. ఆ సినిమా తరువాత ఆమెకు ఆ తరహా అవకాశాలే క్యూకట్టాయి. తాజాగా ఆమె నటించిన ‘ప్యార్ మాంగాహై’ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై దుమ్ము రేపుతోంది. ఇందులో జరీన్ రెచ్చిపోయి మరీ గ్లామర్‌ను ఆరబోసింది. మొత్తానికి గ్లామర్‌ను నమ్ముకున్న ఈ భామకు ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మామూలు సినిమాలతో లాభం లేదనుకున్న జరీన్ నిర్ణయం ఆమెకు ఇంత ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. మరి ఈ చిత్రం విడుదలైన తరువాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!